రజత్ పటీదార్, విరాట్ కోహ్లి అర్ధ సెంచరీ(Fifty)లతో ఆదుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి కష్టాల నుంచి బయటపడింది. సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఇద్దరి బ్యాటింగ్ తో ఆ టీమ్ కోలుకుంది. 37 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే… అందుకు పటీదార్ కేవలం 19 బాల్సే తీసుకున్నాడు.
ఇలా సాగింది…
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCBకి ఓపెనర్లు కోహ్లి(51; 43 బంతుల్లో 4×4, 1×6) ఆచితూచి ఆడితే.. డుప్లెసిస్(25; 12 బంతుల్లో 3×4, 1×6) గట్టిగా ఆడినా తొందరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్(6)కే వెనుదిరిగినా పటీదార్ ఫటాఫట్ బ్యాటింగ్ చేశాడు. మయాంక్ మర్కండే వేసిన 11వ ఓవర్లో నాలుగు సిక్స్ లు బాదాడు. ఆ ఓవర్లో 1, WD, 6, 6, 6, 6, 1 మొత్తంగా 27 రన్స్ వచ్చాయి.
ఉనద్కత్ దెబ్బ…
పేసర్ జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లతో బెంగళూరును దెబ్బతీశాడు. ఊపులో ఉన్న కోహ్లి, పటీదార్ తోపాటు లామ్రోర్ ను ఔట్ చేశాడు. దినేశ్ కార్తీక్(11) ఔటైనా చివర్లో గ్రీన్(37; 20 బంతుల్లో 5×4) రాణించడంతో RCB 7 వికెట్లకు 206 స్కోరు చేసింది.