హరీశ్ రావుకు మోసాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా అమరవీరుల స్తూపమే గుర్తుకు వస్తుందని, ఆయన మోసాలకు ముసుగు ఆ స్తూపమని CM రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. చాంతాడంత రాసిన దాన్ని రాజీనామా(Resign) లెటర్ అనరని, స్పీకర్ ఫార్మాట్లో ఉన్నదే రాజీనామా లేఖగా తీసుకుంటారని గుర్తు చేశారు. హరీశ్ రావు తెలివి ఎక్కడో ఉందంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.
ఆగస్టు 15 లోగా ఏకకాలంలో రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తే తన MLA పదవికి రాజీనామా చేస్తానంటూ BRS లీడర్ హరీశ్ రావు.. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్వయంగా రేవంత్ రెడ్డే స్పందించారు.
‘హరీశ్ రావుకు తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్లలోకి జారుకున్నట్లుంది.. ఇప్పటికీ చెబుతున్నా నీ సవాల్ ను స్వీకరిస్తున్నా.. పంద్రాగస్టు లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో..’ అంటూ రివర్స్ కౌంటరిచ్చారు.