టీ20 ప్రపంచకప్(World Cup)కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారత జట్టు కూర్పుపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ IPL సీజన్లో అదరగొడుతున్న కుర్ర క్రికెటర్లతోపాటు సీనియర్లలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అన్న చర్చ అంతటా నడుస్తున్నది. BCCI సెలక్షన్ కమిటీ సైతం టీమిండియా స్క్వాడ్(Squad)పై దృష్టిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించాడు. అందులో కోహ్లి, పాండ్యకు చోటే కల్పించలేదు.
ఎందుకంటే…
15 మందితో కూడిన మంజ్రేకర్ టీంలో ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ ఉన్నారు. ఆ తర్వాత సంజూ శాంసన్, సూర్యకుమార్ మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. సంజూతోపాటు కేఎల్ రాహుల్, పంత్ ఇలా ముగ్గురు వికెట్ కీపర్లకు చోటు కల్పించాడు. ఆల్ రౌండర్ల కోటాలో పేసర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబెకు బదులు రవీంద్ర జడేజా, కృణాల్ పాండ్యను సూచించాడు.
బౌలర్ల దళం…
స్పిన్నర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ పైనే మంజ్రేకర్ నమ్మకం ఉంచాడు. ఈ ఇద్దరికీ మ్యాచుల్ని గెలిపించే సత్తా ఉందంటున్నాడు. ఒత్తిడి సమయంలో కుల్దీప్.. బుమ్రాతో పోటీపడుతున్నాడు. ఇపుడున్న పరిస్థితుల్లో అతడు మంచి ఆప్షన్ అని తెలిపాడు.
టీమ్ ఇదే…
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృణాల్ పాండ్య.