దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ స్థానాలకు 61% పోలింగ్ నమోదైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు 12 రాష్ట్రాలు(States), ఒక కేంద్రపాలిత ప్రాంతం(Union Territory)లో రెండో విడత పోలింగ్ జరిగింది. మొత్తం 88 నియోజకవర్గాల్లోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటకలో ఓటు వేసిన 91 సంవత్సరాల వృద్ధురాలు కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. మైసూరు లోక్ సభ పరిధిలోని హన్సూర్ లో ముత్తమ్మ అనే వృద్ధురాలు ఓటు వేసిన కొద్దిసేపటికే మృతి చెందారు.
ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ఇలా…
త్రిపుర 76.23%
మణిపూర్ 76.06%
ఛత్తీస్ గఢ్ 72.13%
పశ్చిమబెంగాల్ 71.04%
అసోం 70.66%
జమ్మూకశ్మీర్ 67.22%
కేరళ 63.97%
కర్ణాటక 63.9%
రాజస్థాన్ 59.19%
మధ్యప్రదేశ్ 54.83%
మహారాష్ట్ర 53.5%
బిహార్ 53.03%
ఉత్తరప్రదేశ్ 52.64%