తొలుత లఖ్నవూ సూపర్ జెయింట్స్ చేసింది 165/4. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఆ టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసినట్లు పరుగుల వర్షంతో స్టేడియాన్ని ఊపేసింది. కేవలం ఓపెనర్లే తమ విధ్వంసకర బ్యాటింగ్ తో మరోసారి సత్తా చూపించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్ తో ఆ జట్టు విజయం నల్లేరుపై నడకలా సాగింది. కేవలం 9.4 ఓవర్లలోనే 167/0 చేసి 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది హైదరాబాద్.
తొలుత తడబడి…
SRH బౌలర్లు కట్టుదిట్టంగా బాల్స్ వేయడంతో రన్స్ చేయడమే కష్టమైపోయింది LSGకి. ఓవర్లు కరుగుతున్నా పరుగులు మాత్రం రాలేదు. రాహుల్(29), డికాక్(2), స్టాయినిస్(3), కృణాల్(24) వికెట్లు కోల్పోయారు. కానీ ఆయుష్ బదోని(55 నాటౌట్) హాఫ్ సెంచరీతో, నికోలస్ పూరన్(48) ఆదుకోవడంతో సూపర్ జెయింట్స్ తేరుకుంది.
మరోస్సారి…
హైదరాబాద్ కు మరోసారి ఓపెనర్లు విధ్వంసక ఇన్నింగ్స్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్(89 నాటౌట్; 30 బంతుల్లో 8×4, 8×6), అభిషేక్(75 నాటౌట్; 28 బంతుల్లో 8×4, 6×6) వీరబాదుడుకు దిగడంతో లక్ష్యమంతా వేగంగా కరిగిపోయింది.