విరాట్ కోహ్లి మరోసారి విశ్వరూపం చూపించాడు. ఇప్పటికే అత్యధిక పరుగుల(Highest Runs)తో ఆరెంజ్ క్యాప్ కొనసాగిస్తున్న కోహ్లి.. పంజాబ్ కింగ్స్ తోనూ రెచ్చిపోయి ఆడాడు. రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్ అండతో చెలరేగి ఆడి బెంగళూరుకు భారీ స్కోరునందించాడు.
వీరవిహారం…
ఓపెనర్ కోహ్లి(92; 47 బంతుల్లో 7×4, 6×6), పటీదార్(55; 23 బంతుల్లో 3×4, 6×6) భారీ ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు స్కోరు స్పీడ్ గా సాగింది. డుప్లెసిస్(9), జాక్స్(12) తొందరగా ఔటైనా ఆ ప్రభావం పడనీయలేదు విరాట్, పటీదార్ జోడీ. పటీదార్ 21 బాల్స్ లో, కోహ్లి 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు గ్రీన్(46; 27 బంతుల్లో 5×4, 1×6) సైతం నిలకడగా ఆడాడు.
11కు పైగానే…
ఒకట్రెండు ఓవర్లు మినహా మ్యాచ్ అంతా 11 రన్ రేట్(Run Rate)కు పైగానే కొనసాగిందంటే ఈ జోడీ బ్యాటింగ్ ఎలా నడిచిందో అర్థమవుతుంది. దీంతో ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ 7 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోరు చేసింది.