భారతీయ జనతా పార్టీ(BJP) ఉన్నంతవరకు పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) మనదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పీవోకే మొత్తం భారత్ అధీనంలోనే ఉంటుందని, కశ్మీర్ ఎప్పటికీ మన అంతర్భాగమని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ సభలో షా మాట్లాడారు.
రామ మందిరం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా నాన్చుతూ వచ్చిందని, సర్జికల్ స్ట్రైక్స్ గురించి రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడాతున్నారని అమిత్ షా విమర్శించారు. కశ్మీర్ కోసం తెలంగాణ ప్రజలు సైతం ప్రాణత్యాగానికి సిద్ధపడతారన్నారు.
మజ్లిస్ ఓటు బ్యాంకు కోసం రేవంత్ భయపడుతున్నారని, సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే మోదీ సర్కారు లక్ష్యమని అమిత్ షా అన్నారు.