ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న ఆయన అక్కడి కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి(RO)కి పేపర్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు PM.. గంగానదీ తీరంలోని దశాశ్వమేథ ఘాట్ లో పూజలు చేశారు. అనంతరం గంగా హారతి చేపట్టారు.
దశాశ్వమేథ ఘాట్లో పూజలు నిర్వహించిన అనంతరం మోదీ ప్రత్యేక క్రూయిజ్ లో విహరించారు. సోమవారం రాత్రి ఆయన కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న మోదీ.. తనకు కాశీతో విడదీయరాని బంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి(Chief Minister) యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. అంతకుముందు రిటర్నింగ్ కార్యాలయం వరకు హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేరుకున్నారు.