షార్ట్ సర్క్యూట్ ప్రభావంతో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి. హావ్ డా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈ రైలుకు సంబంధించిన రెండు రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఘటన జరిగింది. పొగలను గమనించిన సిబ్బంది అప్రమత్తమై ట్రెయిన్ ను నిలిపివేసి అందులోని ప్యాసింజర్స్ ను కిందకు పంపించివేశారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ప్రమాదాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. S1 నుంచి S6 వరకు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారాయి.
సిగరేట్ తాగడం వల్లేనా…!
ఈ ఘటనలో రైలు కోచ్ లు పూర్తిగా బూడిదయ్యాయి. భారీగా మంటలు చెలరేగడం, ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకోవడంతో భయానక వాతావరణం ఏర్పడింది. ఇంతటి ప్రమాదానికి ఓ వ్యక్తి నిర్లక్ష్యమే కారణమన్న అనుమానాలు వినపడుతున్నాయి. ఛార్జర్ పాయింట్ వద్ద ఆ వ్యక్తి సిగరెట్ తాగడం వల్లే షార్ట్ సర్క్యూట్ ఏర్పడిందని అనుమానిస్తున్నారు. ఇతర ప్యాసింజర్స్ సిగరేట్ తాగవద్దని చెబుతున్నా పట్టించుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మంటలు రావడాన్ని గమనించిన ఇంకో ప్యాసింజర్ వెంటనే చైన్ లాగడంతో.. అందులో ఉన్నవారంతా కిందకు దిగిపోయారు. ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పుతున్నారు. ట్రెయిన్ ఫైర్ అవడానికి స్మోకింగే కారణమా అన్న కోణంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.