రాష్ట్రంలో నిన్న జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ లెక్కలు పూర్తయ్యాయి. మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 65.67 శాతం ఓటింగ్ పడినట్లు సీఈవో(chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రతి నియోజకవర్గం(Constituency)లోనూ 3 శాతం మేర పోలింగ్ పెరిగిందన్నారు. అత్యధికంగా భువనగిరిలో 76.78% నమోదైతే… అత్యల్పంగా హైదరాబాద్ లో 48.48% ఓట్లు పోలయ్యాయి.
నిన్నటికి భిన్నంగా…
నిన్న అర్థరాత్రి వరకు అందిన సమాచారం మేరకు EC తెలిపిన లెక్కల్లో రాష్ట్రవ్యాప్తంగా 65% దాకా పోలింగ్ నమోదైనట్లు తేలింది. హైదరాబాద్ లోనైతే 40% శాతం కూడా దాటలేదని నిన్నటి అంచనాల్ని బట్టి అర్థమైంది. కానీ ఈనాటి లెక్కలతో భాగ్యనగరంలో ఇంచుమించు సగం వరకు పోలింగ్ నమోదవడం కొత్త చరిత్రకు నాంది పలికింది.
క్రమ సంఖ్య | నియోజకవర్గం | పోలింగ్ శాతం |
1 | భువనగిరి | 76.78 |
2 | ఖమ్మం | 76.09 |
3 | మెదక్ | 75.09 |
4 | జహీరాబాద్ | 74.63 |
5 | ఆదిలాబాద్ | 74.03 |
6 | నల్గొండ | 74.02 |
7 | కరీంనగర్ | 72.54 |
8 | మహబూబ్ నగర్ | 72.43 |
9 | నిజామాబాద్ | 71.92 |
10 | మహబూబాబాద్ | 71.85 |
11 | నాగర్ కర్నూల్ | 69.46 |
12 | వరంగల్ | 68.86 |
13 | పెద్దపల్లి | 67.87 |
14 | చేవెళ్ల | 56.50 |
15 | మల్కాజిగిరి | 50.78 |
16 | సికింద్రాబాద్ | 49.04 |
17 | హైదరాబాద్ | 48.48 |
ఓవరాల్… | 65.67% |