వచ్చే నాలుగు రోజుల(Four Days) పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, 40-50 కిలోమీటర్ల వేగంతో సాగే ఈదురుగాలులతో వానలు పడొచ్చని అంచనా వేసింది. ఈ నెల 19 నుంచి 22 వరకు రోజువారీగా వివిధ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
రేపటి జిల్లాలివే…
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలకు అవకాశాలున్నాయని తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. 24 నాటికి అది వాయుగుండంగా మారనుందని ఆ ప్రభావంతో 23వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అటు తెలంగాణతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ(Heavy) నుంచి అతి భారీ(Very Heavy) వర్షాలు కురుస్తాయని తెలిపింది.