దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో రేపు(ఈనెల 20) ఐదో విడత(Fifth Phase) పోలింగ్ సాగనుండగా ప్రధానమంత్రి మోదీ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. విపక్ష ఇండియా కూటమి మీద ఆయన మాట్లాడిన తీరుపై ECకి కంప్లయింట్ ఇచ్చారు ఆయా పార్టీల నేతలు.
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో(Constituencies) ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి రాజ్ నాథ్ సింగ్ లఖ్నవూ నుంచి, స్మృతి ఇరానీ అమేఠి నుంచి బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారంటూ ప్రధాని మోదీ మాట్లాడటంపై విపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు(Complaint) చేశారు. ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటేనని ఖర్గే సహా సీనియర్ నేతలంతా మండిపడ్డారు.
అయినా ప్రధాని ఎక్కడా తగ్గలేదు. ఈ ఎన్నికలు అభివృద్ధితో కూడిన కురుక్షేత్ర సమరానికి.. మరోపక్క ఓటు జిహాద్ కు నిదర్శనంగా నిలవనున్నాయన్నారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు ఉండటాన్ని మోదీ గుర్తు చేశారు.