ప్రారంభించిన ఒక్క రోజులోనే 5 కోట్ల యూజర్స్ ను అడాప్ట్ చేసుకున్న ‘థ్రెడ్స్’.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ మెటా తీసుకువచ్చిన ఈ కొత్త యాప్ నకు పెద్దయెత్తున రెస్పాన్స్ వస్తున్నది. తమ ట్విటర్ ఎంప్లాయిస్ ను తీసుకుని కాపీరైట్ హక్కులను థ్రెడ్స్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ దావా వేస్తామని హెచ్చరించింది. ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్ కు సంబంధించిన లాయర్ అలెక్స్ స్పిరో… మెటా CEO మార్క్ జుకర్ బర్గ్ కు లెటర్ రాశారు.
తమ సంస్థ ఓల్డ్ ఎంప్లాయిస్ ని వాడుకుంటూ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను ఉపయోగించుకుని నకిలీ యాప్ తయారు చేసిందని ట్విటర్ ఆరోపించింది. ఈ రహస్య సమాచారాన్ని వాడకుండా కట్టడి చేయాలని మెటాకు స్పష్టం చేసింది.