గ్రూప్-1 హాల్ టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 9న జరిగే పరీక్ష కోసం హాల్ టికెట్లు విడుదలయ్యాయి. www.tspsc.gov.in ద్వారా వాటిని పొందవచ్చు.
గ్రూప్-1 పరీక్షకు ఈసారి భారీస్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. 3 లక్షల మంది దాకా ఈ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 563 పోస్టుల భర్తీకి 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ ఇచ్చింది TGPSC. ఈనెల 9న ప్రిలిమ్స్, అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.