
ఒడిశా రైలు ప్రమాద ఘటనకు బాధ్యులుగా చేస్తూ ముగ్గురు రైల్వే అధికారులను CBI అరెస్టు చేసింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్ ను CBI అధికారులు అరెస్టు చేశారు. IPC 304, 201 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసింది. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 292 మంది ప్రాణాలు కోల్పోగా… వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం CBI ఎంక్వయిరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహానగా బజార్ రైల్వే స్టేషన్ వద్ద మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ సహా మూడు రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొన్న ఘటనలో… 292 మంది మృత్యువాత పడ్డారు. మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఇన్సిడెంట్ జరిగినట్లు ఎంక్వయిరీ కమిటీ గుర్తించింది. అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్లు తేల్చిన రైల్వే సేఫ్టీ కమిషన్… ఎంక్వయిరీ రిపోర్ట్ ను రైల్వే శాఖకు అందించింది.
ఈ ట్రెయిన్ ఇన్సిడెంట్ లో కుట్ర కోణంపై అనుమానాలు రావడంతో రైల్వే బోర్డు సిఫార్సు మేరకు… CBI ఎంక్వయిరీ స్టార్ట్ చేసింది. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ స్టాఫ్ తప్పిదమే ఇన్సిడెంట్ కు మెయిన్ రీజన్ అని CBI కన్ఫర్మ్ చేసింది. మల్టీపుల్ లెవెల్లో మిస్టేక్స్ ఉన్నాయని ఆగ్నేయ రైల్వే జోన్ సేఫ్టీ కమిషనర్ M.A.చౌధురి దర్యాప్తులో తేలింది.