రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితం(First Result) వెలువడింది. రెండు పార్టీలు(బీజేపీ-కాంగ్రెస్) మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న వేళ.. ఖమ్మం సీటు ఖరారైంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఘన విజయం సాధించారు. ఈయనకు 3.5 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యం లభించడం సంచలనంగా మారింది.
మొదట్నుంచీ రఘురాంరెడ్డి లీడ్ లో కొనసాగారు. ప్రత్యర్థులకు అందనంత రీతిలో ఆధిక్యం కొనసాగిస్తూ ఆశ్చర్యపరిచారు.