ఎన్డీయే-ఇండియా కూటముల(Alliances) హోరాహోరీ పోరులో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల(Candidates) జాతకాలు తారుమారయ్యాయి. మరోవైపు కొందరికి మాత్రం బంపర్ మెజారిటీ దక్కింది. దేశవ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యత(Majority) దక్కితే అందులో మన రాష్ట్రానికి చోటు దక్కింది. నల్గొండ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి 5,59,905 ఓట్ల మెజార్టీ వచ్చింది.
దేశవ్యాప్తంగా చూస్తే మధ్యప్రదేశ్ లోని ఇండౌర్ నుంచి పోటీ చేసిన BJP అభ్యర్థి శంకర్ లాల్వాణీ 11,75,092 ఓట్లతో ప్రథమ స్థానం(First Place)లో నిలిచారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం 7,44,716 ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. భారీ మెజార్టీ సాధించిన ఏడుగురిలో ఐదుగురు కమలం పార్టీకి చెందినవారైతే, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు తృణమూల్ కాంగ్రెస్(TMC) నుంచి ఉన్నారు.
పేరు | నియోజకవర్గం | పార్టీ | ఆధిక్యం |
శంకర్ లాల్వాణీ | ఇండోర్ | బీజేపీ | 11,75,092 |
రకీబుల్ హుసేన్ | ధుబ్రీ | కాంగ్రెస్ | 10,12,476 |
శివరాజ్ సింగ్ చౌహాన్ | విదిశ | బీజేపీ | 8,21,408 |
సి.ఆర్.పాటిల్ | నవ్సారి | బీజేపీ | 7,73,551 |
అమిత్ షా | గాంధీనగర్ | బీజేపీ | 7,44,716 |
అభిషేక్ బెనర్జీ | డైమండ్ హార్బర్ | టీఎంసీ | 7,10,930 |
కె.రఘువీర్ రెడ్డి | నల్గొండ | కాంగ్రెస్ | 5,59,905 |