ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి(Prime Minister)గా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టబోతున్న వేళ.. ఆయన ప్రమాణ స్వీకారం(Oath) ఎప్పుడా అన్న ఉత్కంఠ కమలం పార్టీ శ్రేణులతోపాటు అందరిలోనూ కనిపిస్తున్నది. NDA కూటమి పీఠం దక్కించుకోవడంతో ఇక తన రాజీనామా లేఖను ఈరోజు రాష్ట్రపతికి అందజేసే అవకాశముంది. ఈ క్రతువు పూర్తయిన తర్వాత బుధవారం సాయంత్రం NDA కూటమి నేతలంతా ఢిల్లీలో సమావేశమవుతున్నారు.
ఆరోజే ముహూర్తం…
ఈ సమావేశంలో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని NDA పక్షాలు ఎనుకోనున్నా(Elect)యి. అయితే మోదీ ప్రమాణ స్వీకారం మాత్రం ఈనెల 8 నాడు జరగనున్నట్లు తెలుస్తున్నది. శనివారం మధ్యాహ్నం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కమలం పార్టీ భాగస్వామ్య పక్షాల నేతలంతా హాజరు కాబోతున్నారు.