మణిపూర్(Manipur)లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. చివరకు తీవ్రవాదులు(Terrorists) వరుసగా దాడులు చేసే స్థాయికి వెళ్లింది పరిస్థితి. అక్కడి ప్రజలపైనే కాదు ఏకంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సెక్యూరిటీ కాన్వాయ్ పై దాడి జరిగింది. కాంగ్ పోక్పి(Kangpokpi) జిల్లాలో దుర్ఘటన జరిగింది. నేషనల్ హైవే-53పైన గల కొట్లెన్ గ్రామం వద్ద ఊహించని పరిణామంలో కాన్వాయ్ లోని ఒక వాహన(Vehicle) డ్రైవర్ కు గాయాలయ్యాయి. కాన్వాయ్ లోని భద్రతా సిబ్బందిపై తీవ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
ఈ మధ్యకాలంలో జిరిబామ్(Jiribam) జిల్లాలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. జిరిబామ్ జిల్లాలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు CM బీరేన్ సింగ్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ పై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కుకీ, మైతీ తెగల మధ్య చోటుచేసుకున్న వ్యవహారంలో మణిపూర్ రాష్ట్రం రావణకాష్ఠంలా మారిన సంగతి తెలిసిందే.