సాయంత్రం 6 గంటల సమయాన… బస్సు లోయ మీదుగా వెళ్తున్నది.. అంతలోనే ఉగ్రవాదుల విచ్చలవిడి కాల్పులు.. 15 నిమిషాల పాటు ఏకధాటిగా కాల్పులు.. బస్సు అదుపు తప్పి పెద్ద బండరాళ్లను ఢీకొట్టింది. చెట్లు, రాళ్లు అడ్డుగా ఉండటంతో లోయలోకి జారకుండా ఆగిపోయింది.. అంతలోనే అంతా నిశ్శబ్దం.. దీంతో కాల్పుల మోత ఆగిపోయింది.. ఇదీ ఆదివారం నాడు వైష్ణోదేవి(Vaishnodevi) భక్తుల(Pilgrims)పై జరిగిన ఉగ్రదాడి భయానక దృశ్యాల విషాద గాథ.
వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తుల బస్సుపై కశ్మీర్లోని రియాసి(Reasi) జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోతే 33 మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం శివ్ ఖోరీ(Shivkhori) ఆలయంలో దర్శనం పూర్తయ్యాక వైష్ణోదేవి యాత్ర మొదలైంది. కొండల మలుపుల్లో బస్సు నిదానంగా వెళ్తుంటే అందులో ఉన్నవారంతా మంచి నిద్రలో ఉన్నారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న వారిపై బుల్లెట్లు దూసుకురావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
చీకట్లో ఏం జరుగుతుందో తెలియక అయోమయం కనిపించిందని బాధితులు తెలిపారు. అరుపులు(Screaming) ఆగిపోవడం(Stopped)తో అంతా చనిపోయారనుకున్న ఉగ్రవాదులు(Terrorists) కాల్పులు ఆపివేశారు. ఒక్కరొక్కరుగా బస్సు నుంచి బయటకు వచ్చి సమాచారం ఇవ్వడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఇలా వైష్ణోదేవి భక్తులు ఆ రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు.