ఆధార్ కార్డును ఉచితం(Free)గా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఇంకా రెండ్రోజులే(Two Days) ఉంది. ఆ తర్వాత అప్డేట్(Update) చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు పూర్తి చేయనివారు వెంటనే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI).. ఇందుకోసం జూన్ 14 వరకు గడువు(Time) ఇచ్చింది.
ఇప్పటికే…
ఉడాయ్ మొదట 2023 మార్చి 15 వరకు, ఆ తర్వాత రెండోసారి 2023 డిసెంబరు 14 దాకా గడువిచ్చింది. మళ్లీ 2024 మార్చి వరకు మూడోసారి… ఇక నాలుగోసారి ప్రస్తుత గడువు జూన్ 14 దాకా అవకాశమిచ్చింది. ప్రజల నుంచి స్పందన(Response) బాగా ఉండటం వల్లే గడువును పొడిగించినట్లు ఉడాయ్ తెలిపింది.
ఎవరంటే…
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటినవారు అప్డేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఉడాయ్ వెబ్ సైట్లోకి లాగిన్ అయి ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ను సబ్మిట్(Submit) చేయాలి. ధ్రువీకరణకు రేషన్ కార్డు, ఓటర్ ID వంటివి అవసరమవుతాయి. ఇక ఈ గడువు పొడిగించే అవకాశం లేకపోవడంతో ఇప్పటికైనా ఆధార్ అప్డేట్ చేసుకోవడం మంచిది.