సున్నాకే ఒక వికెట్.. 56కే నాలుగు వికెట్లు.. పేసర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) దెబ్బకొట్టినా అమెరికా(USA) మిడిలార్డర్ బ్యాటర్లు నిలబడ్డారు. మరీ అంత తక్కువ స్కోరు కాకుండా గౌరవప్రదంగా ముగించారు. టాస్ గెలిచిన భారత్(Team India).. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. క్రీజులో కుదురుకోకుండానే షాయన్ జహంగీర్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ స్టీవ్ టేలర్(24) మాత్రం కొద్దిసేపు క్రీజులో అతుక్కుపోయాడు.
4 వికెట్లతో హడల్…
అవతలి ఎండ్ లో అండ్రీస్ గౌస్(2), ఆరోన్ జోన్స్(11) ఔటయ్యారు. టేలర్ ఔటైన తర్వాత నితీశ్ కుమార్(27), కోరె అండర్సన్(15) టీమ్ఇండియా బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. ఈ ఇద్దరూ ఔట్ కావడంతో USA 96/6తో నిలిచింది. బుమ్రా, సిరాజ్ 6కు పైగా ఎకానమీతో పరుగులిస్తే అర్షదీప్ మాత్రం 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ కే 4 వికెట్లు పడగొట్టాడు. 17 బంతుల్ని అర్షదీప్ డాట్స్ గా వేయగా.. చివరకు అమెరికా 8 వికెట్లకు 110 పరుగులు చేసింది.