ఆంధ్రప్రదేశ్(AP)లో చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరలయ్యాయి. ఆ వైరల్ అయింది బాబు ప్రమాణస్వీకారమో లేక మంత్రులదో కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాది. వెంకయ్యనాయుడుతో ముచ్చటిస్తున్న సమయంలో తన వద్దకు వచ్చి విషెస్ చెప్పిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో అమిత్ షా సాగించిన సంభాషణ సంచలనంగా మారింది.
అసలు కథ ఇలా…
తమిళిసైకి వార్నింగ్ ఇస్తున్నట్లు అమిత్ షా హావభావాల్ని(Expressions) చూస్తే అందరికీ అర్థమైనట్లే కనపడింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. తమిళనాడులో MPలుగా పోటీచేసిన అన్నామలై, తమిళిసై మధ్య వివాదం జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ ఇద్దరూ ఓడిపోవడం కూడా అంతర్గతం(Internal)గా ఏర్పడిన కలహాలేనన్న వార్తలు వచ్చాయి. దీనిపైనే తమిళిసైకి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారన్నది టాక్.
ఆమె వివరణ…
‘నిన్న నేను హోంమంత్రి అమిత్ షాను కలిశా.. 2024 ఎన్నికల తర్వాత పరిణామాలు, సవాళ్ల గురించి ఆయన అడిగారు.. రాజకీయాలతోపాటు నియోజకవర్గ పనులు చూసుకోవాలని చెప్పారు.. నా గురించి వస్తున్న ఊహాగానాలకు క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు..’ అంటూ ట్వీట్ చేశారు.