ఒక మ్యాచ్ ఓడి మరోటి రద్దయిన పరిస్థితుల్లో సూపర్-8కు వెనుకబడ్డ ఇంగ్లండ్… పసికూన ఒమన్(Oman)పై భారీ విజయం సాధించింది. ఒమన్ టీంలో ఒక్కరు మాత్రమే రెండంకెల(Double Digit) స్కోరు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్(England) బౌలర్లు రెచ్చిపోయి వికెట్లు తీయడంతో ఒమన్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.
ఇలా…
ప్రతీక్ అథావలె(5), కశ్యప్ ప్రజాపతి(9), అకీబ్ ఇలియాస్(8), జీషన్ మక్సూద్(1), ఖలీద్ కైల్(1) ఆయాన్ ఖాన్(1), షోయబ్ ఖాన్(11) రన్స్ చేశారు. ఒకరు సున్నాకు, ముగ్గురు 1కి, ఒకరు 2 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో 3 వికెట్లు తీసుకున్నారు.
ధనాధన్…
ఆ టార్గెట్ ను ఇంగ్లండ్ ధనాధన్ బ్యాటింగ్ తో ముగించింది. కేవలం 3.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 50 రన్స్ చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఫిల్ సాల్ట్(12), జోస్ బట్లర్(24 నాటౌట్), విల్ జాక్స్(5), జానీ బెయిర్ స్టో(8 నాటౌట్) గేమ్ ను ముగించారు.