ఎన్నికల్లో గెలిస్తే వరికి మద్దతు ధర(MSP) పెంచుతామని ఇచ్చిన హామీని భారతీయ జనతా పార్టీ(BJP) నిలబెట్టుకుంది. ఒడిశాలో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ… మాట ఇచ్చినట్లుగానే మద్దతు ధర క్వింటాలుకు రూ.3,100 అమలు చేస్తున్నది. నిన్న పదవీ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝీ.. తొలి సంతకాన్ని వరికి మద్దతు ధరపైనే పెట్టారు.
‘సమృద్ధ కృషక్ నీతి’ పేరిట 100 రోజుల్లో వ్యవసాయ రంగంలో చేపట్టబోయే కార్యక్రమాల్ని ఒడిశా మ్యానిఫెస్టోలో చేర్చారు. MSP(Minimum Support Price)తోపాటు అన్ని ఇళ్లకు నీటి సరఫరా, పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని BJP హామీ ఇచ్చింది. అందులో భాగంగా తొలి సంతకాన్ని వరికి మద్దతు ధరపై చేయడంతో ఇచ్చిన మాటను BJP నిలబెట్టుకుంది.
మన దగ్గర మంటలు..
ఒడిశా సీఎం ఒక్కరోజులోనే మాట నిలబెట్టుకున్నారని.. మన CM రేవంత్ కేవలం మాటలకే పరిమితమయ్యారంటూ BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. మద్దతు ధరతోపాటు పింఛన్లు, ఇతర హామీలన్నీ నెరవేర్చడం లేదని విమర్శించారు.