టెంపో ట్రావెలర్(Tempo Traveller) అదుపు తప్పి నదిలోకి దూసుకుపోయిన ఘటనలో 12 మంది మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లా రాయ్ టొలి ఏరియాలో జరగ్గా.. మొదట ఆ వాహనం పెద్ద లోయలోకి జారి అక్కణ్నుంచి నదిలో పడిపోయింది. గాయపడ్డవారిని హెలికాప్టర్లో(Chopper) రుషికేశ్ ఎయిమ్స్ కు తరలించారు. బద్రీనాథ్ రూట్లో రుద్రప్రయాగ్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
26 మందితో హర్యానా రిజిస్ట్రేషన్ నంబరు గల ఆ వెహికిల్ ఢిల్లీ నుంచి చోప్టా, ఉఖీమఠ్ నుంచి నిన్న రాత్రి బయల్దేరింది. వీరంతా ఛార్ ధామ్ యాత్రకే వెళ్తున్నారా అనే విషయంలో క్లారిటీ రాలేదు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో సహాయం అందించాలంటూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కలెక్టర్‌ను ఆదేశించారు.