కొద్ది నెలల క్రితం కర్ణాటక(Karnataka)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తాజా(Latest)గా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచింది. ఈరోజు నుంచి కొత్త ధరలు(New Prices) అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను(Sales Tax) పేరిట నిధుల్ని రాబట్టుకోనుంది. కొత్త రేట్ల ప్రకారం పెట్రోలుపై రూ.3, డీజిల్ పై రూ.3.02 చొప్పున పెరుగుతాయి.
సిద్ధరామయ్య సర్కారు నిర్ణయాన్ని అక్కడి పెట్రోలియం డీలర్లు స్వాగతించారు. దీంతో కన్నడనాట పెట్రోలుపై 25.92% నుంచి 29.84%నికి… డీజిల్ పై 14.3% నుంచి 18.4% సేల్స్ టాక్స్ పెరుగుతుంది. ఈ సేల్స్ టాక్స్ అనేది నేరుగా రిటైల్(Retail) కస్టమర్లపైనే పడనుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచార(Campaign) సభల్లో BJP ఆరోపించింది. అది నిజమన్నట్లుగా ఇప్పుడు కర్ణాటకలో రేట్లు పెరిగాయి.
పెరిగిన ధరలు(రూ.ల్లో) ఇలా…
ఇంధనం | పాత ధర | కొత్త ధర | వ్యత్యాసం |
పెట్రోలు | 99.84 | 102.84 | 3 |
డీజిల్ | 85.93 | 88.95 | 3.02 |