పది గంటలకు ఆఫీసులో ఉండాలి… ఓ అరగంట అటుఇటైనా ఏం కాదులే… అని అనుకునే ఉద్యోగుల(Employees)కు ఇక నుంచి షాక్ తగలనుంది. సాయంత్రం ఐదింటికి బదులు ఓ గంట ముందుగానే బయటపడితే పోలా అని భావించే సిబ్బందికి ఇక చుక్కలే. విధుల(Duties)కు ఏ మాత్రం ఆలస్యంగా వచ్చిన పనిష్మెంట్ తప్పేటట్లు లేదు. బయోమెట్రిక్ ఉన్నా దాన్ని తప్పించుకుంటూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్న సిబ్బందిని గాడిన పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది.
ఇక కోతలే…
ఆఫీసులకు లేట్ గా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత(Cutting) పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సిబ్బంది హాజరు(Attendance)పై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. తరచూ ఆఫీసులకు లేట్ రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.
తగిన కారణాలుంటే…
చాలామంది ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆలస్యంగా వచ్చినా, ముందుగా వెళ్లిపోయినా సదరు ఉద్యోగుల సెలవుల్లో ఇక నుంచి కోత విధించాలని శాఖాధిపతులకు ఆదేశాలిచ్చింది. తగిన కారణాలుంటే నెలలో రెండు సార్లు అదీ రోజుకు గంటకు మించకుండా ఆలస్యం(Late)గా రావడాన్ని క్షమించొచ్చని క్లారిటీ ఇచ్చింది.