బస్ స్టేషన్లో పుట్టిన బిడ్డకు జీవితకాలం(Life Time) పాటు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ RTC నిర్ణయం తీసుకుంది. సదరు అమ్మాయికి ‘బర్త్ డే గిఫ్ట్’గా లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాసును మంజూరు చేసింది. సమయస్ఫూర్తితో స్పందించి సకాలంలో కాన్పు చేసిన సంస్థ సిబ్బందిని TGSRTC ఎం.డి. వీసీ సజ్జనార్ అభినందించారు.
వివరాలు ఇలా…
కుమారి అనే నిండు గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం ఈ నెల 16న కరీంనగర్ బస్ స్టేషన్ వచ్చారు. ఆ సమయంలోనే ఆమెకు నొప్పులు వచ్చాయి. దీన్ని గమనించిన RTC సిబ్బంది వెంటనే 108కు కాల్ చేశారు. ఈలోపే నొప్పులు(Pains) మరీ ఎక్కువ కావడంతో ఆ మహిళా ఉద్యోగులే డెలివరీకి ఏర్పాట్లు చేశారు.
చీరలు అడ్డుపెట్టి…
బస్టాండులోనే చీరలు అడ్డు పెట్టి కాన్పు(Delivery) చేయగా పండంటి ఆడపిల్ల జన్మించింది. అనంతరం తల్లీబిడ్డల్ని అంబులెన్సులోనే ప్రభుత్వాసుపత్రికి(Govt Hospital) కు తరలించారు. ఆ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపి మరీ డెలివరీ చేసిన సిబ్బంది ధైర్యాన్ని డాక్టర్లు కొనియాడారు.
దీనిపై యాజమాన్యం(Management) స్పందించి తమ సిబ్బందిని హైదరాబాద్ బస్ భవన్లో ఘనంగా సన్మానించింది. బస్ స్టేషన్లలో పుట్టిన బిడ్డలకు జీవితకాలపు పాస్ లు ఇవ్వాలని గతంలో సంస్థ నిర్ణయించిన మేరకు తాజాగా ఆ బిడ్డకు పాస్ కేటాయించారు.