సొంతగడ్డపై జరుగుతున్న వన్డేల్లో భారత మహిళా క్రికెటర్లు(Women Players) రెచ్చిపోతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన ఆతిథ్య జట్టు(Host Team).. రెండో వన్డేలోనూ ప్రతాపం చూపించింది. బెంగళూరు మ్యాచ్ లో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 325 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సెకండ్ సెంచరీ…
ఓపెనర్ సృతి మంధన(136; 120 బంతుల్లో 18×4, 2×6), కెప్టెన్ హర్మన్ ప్రీత్(103; 88 బంతుల్లో 9×4, 3×6) సెంచరీలతో దంచికొట్టడంతో సౌతాఫ్రికా బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా తొలి వన్డేలోనూ సెంచరీ(117) చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. సెకండ్ మ్యాచ్ లోనూ దుమ్ముదులిపింది. మరో ఓపెనర్ షెఫాలి వర్మ(20), డయాలన్ హేమలత(24) తొందరగా ఔటైనా.. కెప్టెన్ తో కలిసి స్మృతి భారీగా పరుగులు రాబట్టింది.