రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సిన పథకాల(Schemes)పై క్లారిటీ రావాల్సిన దృష్ట్యా రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) సమావేశం కాబోతున్నది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో భేటీ జరగనుంది. రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమా, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలు పెండింగ్ లో ఉన్నందున వీటిపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.
రేషన్ కార్డులు…?
అన్నింటికీ ఏకైక ఆధారంగా నిలిచే రేషన్ కార్డుల విషయంలో విపరీతమైన జాప్యం(Delay) ఏర్పడుతున్నది. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసినా ఎన్నికల కోడ్ వల్ల అది అమలు కాలేదు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు స్కీమ్స్ ప్రజలకు అందాలంటే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంది. మరి దీనిపై నిర్ణయం వెలువడుతుందా అన్నది చూడాల్సి ఉంది.