అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి దర్శనానికి నిత్యం(Daily) భక్తుల సంఖ్య వేలాదిగా ఉంటుంది. ఏడుకొండలవాడి దర్శనానికి విచ్చేసే భక్తుల(Pilgrims) ఆకలి తీర్చేందుకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్(MTVAC) ద్వారా ఆహారం అందిస్తుంటారు. అయితే రోజుకు ఎంతమంది కొండపై భోజనం చేస్తున్నారు.. వారికి అవుతున్న ఖర్చు ఎంత అన్న వివరాలు TTD ఈవో శ్యామలరావు సమీక్షలో వెల్లడయ్యాయి.
తిరుమల, తిరుపతిలో…
తిరుమల, తిరుపతిల్లో రోజుకు సగటున(Average) 1.92 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరిస్తుండగా ఇందులో తిరుమల కొండపై 1.75 లక్షలు, తిరుపతిలో 17,000 మంది భోజనం చేస్తున్నారు. వారాంతాల్లో(Weekends) తిరుమలలో ఈ సంఖ్య మరింత పెరిగి 1.95 లక్షలుగా, తిరుపతిలో 19,000గా ఉంటున్నది. ఇలా రెండు చోట్ల కలిపి వారాంతాల్లో 2.14 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.
ఖర్చు ఇలా…
ఒకరోజు అన్న ప్రసాదం కోసం అవుతున్న ఖర్చు రూ.38 లక్షలుగా ఉంది. దాతలు ఇచ్చే విరాళాలతో పాటు TTD నిధుల్ని ఈ అన్నప్రసాదం కోసం వెచ్చిస్తున్నారు.