తొలుత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ, ఆ తర్వాత బుమ్రా మ్యాజిక్ స్పెల్(Magic Spell)తో టీ20 ప్రపంచకప్ సూపర్-8 తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. అఫ్గాన్ పై మంచి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆ తర్వాత ఆ టీమ్ ను కోలుకోలేని దెబ్బతీసింది. తొలుత 181/8 చేసిన రోహిత్ సేన(Team) అనంతరం అఫ్గాన్ ను 134కే ఆలౌట్ చేసి 47 పరుగుల తేడాతో అఫ్గాన్ ను చిత్తు చేసింది.
బ్యాటింగ్ లో…
రోహిత్(8), కోహ్లి(24), పంత్(20), దూబె(10) ఔటైనా పాండ్యతో కలిసి సూర్య(53; 28 బంతుల్లో 5×4, 3×6) నిలబడ్డాడు. పాండ్య(32; 24 బంతుల్లో 3×4, 2×6), ఆఖర్లో అక్షర్(12), రవీంద్ర జడేజా(7) కూడా తక్కువకే ఔటవడంతో భారత్ మరింత స్కోరు చేయలేకపోయింది. ఫజల్ హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
బౌలింగ్ లో…
బుమ్రా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీయడం, అటు అర్షదీప్ సైతం 3 వికెట్లతో సత్తా చాటడంతో కంటిన్యూగా వికెట్లు కోల్పోయింది అఫ్గాన్. ఒమర్జాయ్(26)దే హయ్యెస్ట్ స్టోర్.