సూపర్-8 గ్రూప్-1లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోవడంతో మెరుగైన(Best) రన్ రేట్ ఆధారంగా ఆసీస్(Australia) విజేతగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా(Bangladesh) 8 వికెట్లకు 140 రన్స్ చేసింది. అనంతరం కంగారూలు 100/2తో ఉన్న సమయంలో వర్షం పడి మ్యాచ్ ముందుకు సాగలేదు. దీంతో 28 పరుగుల తేడాతో విజయం ఆ టీమ్ సొంతమైంది.
బ్యాటింగ్ ఇలా…
బంగ్లా బ్యాటింగ్ లో నజ్ముల్ హుస్సేన్ శాంటో(41), తౌహిద్ హృదాయ్(40) మాత్రమే బాగా ఆడారు. ప్యాట్ కమిన్స్ 3, ఆడమ్ జంపా 2 వికెట్లు తీసుకున్నారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్(53), ట్రావిస్ హెడ్(31) రాణించడంతో 11.2 ఓవర్లలో స్కోరు 100/2కు చేరుకుంది. ఈ దశలో వాన పడటంతో మ్యాచ్ ఆగిపోగా కంగారూ జట్టును విజేతగా ప్రకటించారు.