మోదీ సర్కారు తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో కేంద్రం కొత్తవాటిని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టాల్ని అమలు చేయవద్దంటూ ప్రధానిని పశ్చిమబెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.
మరో వారం తర్వాత భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు అమలవుతాయి. పౌరులకు సత్వర న్యాయం అందించడం, న్యాయ వ్యవస్థ(Judiciary)ను బలోపేతం(Strongest) చేసేందుకు గాను వీటిని రూపొందించినట్లు BJP సర్కారు ప్రకటించింది.
అదే పెద్ద ఎగ్జాంపుల్…
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 సంవత్సరాల క్రితం 2020 డిసెంబరు 22న ఉగ్ర దాడి జరిగింది. ఈ కేసులో పాకిస్థాన్ లష్కర్-ఇ-తొయిబాకు చెందిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ కు మరణశిక్ష పడింది. దీనిపై అతడు రెండు సార్లు క్షమాభిక్ష పెట్టుకుంటే రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ మే 15న పంపిన లెటర్ అదే నెల 27న.. ఆ తర్వాత పంపిన అభ్యర్థనను జూన్ 13న ద్రౌపదీ ముర్ము రిజెక్ట్ చేశారు.
పాత చట్టాల ప్రకారం ప్రెసిడెంట్ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ ఈ జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తే ఇక రాష్ట్రపతి డిసిషన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించే అవకాశం ఉండదు. అంతటి పటిష్ఠంగా ఈ చట్టాలు తయారయ్యాయి.