గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో పాసయి పత్రాలు అందుకున్న అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన(Certificate Verification) నిర్వహిస్తున్నట్లు మహాత్మ జ్యోతిబాపూలే BC గురుకుల విద్యాసంస్థల సొసైటీ తెలిపింది. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్’కు అటెండ్ కావాలని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.
అక్కడికే రావాలి…
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10 లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్లో ఈ ‘సర్టిఫికెట్ వెరిఫికేషన్’ జరగనుంది. MJP BC గురుకులాల్లో నియామక పత్రాలు అందుకున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్(Originals)తో రావాలని ప్రకటనలో తెలియజేశారు. ఆయా పోస్టుల వారీగా అభ్యర్థుల ఫోన్ నంబర్లకు మెసేజ్ పంపించామని, పూర్తి వివరాలు తెలియజేసినందున ఆయా వ్యక్తులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ రావాల్సి ఉంటుందని సైదులు గుర్తు చేశారు.
ఈ తేదీల్లో సబ్జెక్టుల వారీగా…
24-06-2024…
|
డిగ్రీ లెక్చరర్స్… లైబ్రేరియన్(స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్)
ఫిజికల్ డైరెక్టర్(జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్)
|
25-06-2024…
|
జూనియర్ లెక్చరర్(ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ)
|
26-06-2024… | జూనియర్ లెక్చరర్(హిందీ, తెలుగు, మ్యాథ్స్, పీజీటీ(తెలుగు, హిందీ) |
27-06-2024… | PGT(ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్) ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్-II |
28-06-2024… | TGT(హిందీ, బయాలాజికల్ సైన్స్, సోషల్) |
29-06-2024… | TGT(ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్) |
30-06-2024… | TGT(తెలుగు, మ్యాథ్స్) |