ఎట్టకేలకు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు(Transfers), ప్రమోషన్లు(Promotions) పూర్తవడంతో ఇక ఖాళీ అయిన SGT పోస్టులకు బదిలీ కార్యక్రమం మొదలు కాబోతున్నది. మల్టీజోన్-1(వరంగల్) పరిధిలోని 19 జిల్లాల్లో ప్రమోషన్ల ప్రక్రియ ముగియడంతో అక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ల వంతు స్టార్ట్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూళ్ల(PS) హెడ్ మాస్టర్లుగా SGTలు ప్రమోషన్ తీసుకుని బాధ్యతలు చేపట్టడంతో ఇక ఆ ఖాళీల భర్తీ చేపట్టాల్సి ఉంది.
సదరు ఖాళీల్ని భర్తీ చేసేందుకు మిగతా SGTలకు ట్రాన్స్ ఫర్ అవకాశం రానుండగా, అందుకోసం వెబ్ ఆప్షన్ల(Web-Options) ప్రక్రియ మొదలైంది. అటు మల్టీజోన్-2(హైదరాబాద్) పరిధిలోని బడుల్లో SGTలు, భాషా పండితులు, PETలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు వెబ్ ఆప్షన్లు శనివారం ప్రారంభం కానున్నాయి.