అమెరికా జరిగిన సూపర్-8 మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ గెలుపు(Big Win)ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన USA 19.5 ఓవర్లలో 128 రన్స్ కు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 130 స్కోరు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అమెరికా అలా…
USA బ్యాటర్లలో అండ్రీస్ గౌస్(29), నితీశ్ కుమార్(20) స్కోర్లు చేశారు. కరీబియన్ బౌలర్లలో రసెల్, ఛేజ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఇక బ్యాటింగ్ బాదుడు మొదలైంది. ఓపెనర్ షాయ్ హోప్(82; 39 బంతుల్లో 4×4, 8×6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అందిన బంతినల్లా కసితీరా బాదుతూ స్టాండ్స్ లోకి పంపించడంతో విండీస్ టార్గెట్ క్రమంగా కరిగిపోయింది. జాన్సన్ ఛార్లెస్(15) ఔటైనా మిగతా లాంఛనాన్నిపూరన్(27)తో కలిసి షాయ్ హోప్ పూర్తి చేశాడు.