యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఆటతీరు ఎలా ఉంటుందో మళ్లీ మళ్లీ చెప్పనక్కర్లేదు. కారు ప్రమాదం(Accicent)లో తృటిలో ప్రాణాలు దక్కించుకుని, ఏడాదిన్నరకు పైగా ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టడం అంత సాధ్యం కాదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మొన్నటి IPLతోపాటు తాజా టీ20 వరల్డ్ కప్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటి పంత్ ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ పొగడ్తల్లో ముంచెత్తాడు.
చిన్ననాటిలా…
ఏ ఫార్మాట్లో అయినా ఎలాంటి ఆర్డర్లో అయినా రాణిస్తున్న పంత్ ను చూస్తే తొలినాళ్లలో ఆడిన ఆడమ్ గిల్ క్రిస్ట్ కు చాలా దగ్గరగా ఉన్నాడని కివీస్ మాజీ(Formar) ప్లేయర్ ఇయాన్ స్మిత్ అన్నాడు. కోహ్లి, రోహిత్ వంటి దిగ్గజాల్ని అతడు అందుకోగలడు.. వైట్-బాల్ క్రికెట్లో ఫస్ట్ డౌన్లో రాణించడం అంత సులువు కాదు.. ఆ స్థానానికి పంత్ సరిగ్గా సరిపోతాడు.. ఎందుకంటే ఎక్కువ డెలివరీల్ని ఆడే ఛాన్స్ ఉంటుంది..’ అని స్మిత్ ప్రశంసించాడు.
రాహుల్ కు…
‘కేఎల్ రాహుల్ వరల్డ్-క్లాస్ క్రికెటర్.. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఏకైక ప్లేయర్ పంత్.. ఫస్ట్ బాల్ నుంచే ఆధిపత్యం చూపే 26 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ టెస్ట్ క్రికెట్లో మిడిలార్డర్లో, వైట్-బాల్ మ్యాచుల్లో టాప్ ఆర్డర్లో అచ్చం గిల్లీ లాగే ఉన్నాడు.. అంతర్జాతీయ క్రికెట్లో 15,000 పరుగులు, 800 క్యాచ్ లు తీసుకున్న గిల్ ను అతడు అందుకోగలడు..’ అని స్మిత్ కొనియాడాడు.