సర్కారీ ఆఫీసులంటే ఇష్టమొచ్చినట్లుగా రావడం, కావాలనుకున్నప్పుడు వెళ్లిపోవడం చూస్తుంటాం. బయోమెట్రిక్(Biometric) ఉన్నా గాలికొదిలేయడమే. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఉద్యోగుల(Employees)కి అల్టిమేటం జారీ చేసింది. లేట్ గా వచ్చేవారి సెలవుల్లో కోత(Cut) పెట్టాలని ఇప్పటికే నిర్ణయించిన సర్కారు.. ఇప్పుడు ఆదేశాలిచ్చేసింది.
దాటితే ఇక…
ఆఫీసుల్లో ఉదయం 9 గంటలకు విధులు(Duties) మొదలవుతాయి. పోనీ 15 నిమిషాలు సరే.. చివరకు 9:15 కల్లా అటెండెన్స్ పడాలి. లేకపోతే సగం రోజు(Half Day)ను క్యాజువల్ లీవ్ గా చూడాల్సి ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(DoPT) వార్నింగ్ ఇచ్చింది.
అందరికీ వర్తింపు…
స్థాయి భేదం లేకుండా అంతా బయోమెట్రిక్ వేయాల్సిందేనని DoPT స్పష్టం చేసింది. తొమ్మిదింబావుకు రాలేనని ముందుగానే చెప్పినట్లయితే అప్పుడే CL కూడా అప్లై చేయాల్సి ఉంటుందని తెలిపింది. కార్యాలయాలు పొద్దున 9కి మొదలై సాయంత్రం 5:30కు ముగుస్తాయి.
సమయపాలన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన DoPT ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. తాము రాత్రి 7 గంటల దాకా పనిచేస్తున్నా కిందిస్థాయి ఉద్యోగులు టైమ్ పాటించట్లేదని.. తద్వారా ఫైళ్లు పేరుకుపోతున్నాయని శాఖాధిపతులు(HOD) కంప్లయింట్ చేశారు. దీంతో ఇక లేట్ గా వచ్చే వారికి చెక్ చెప్పాలని సర్కార్ డిసైడ్ అయింది.