
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వరంగల్ లో పర్యటిస్తారు. రూ.500 కోట్లతో చేపట్టే గూడ్స్ రైల్ వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. వ్యాగన్ల పెయింటింగ్ కోసం అడ్వాన్స్ డ్ టెక్నాలజీ రోబో మిషిన్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభకు PM అటెండ్ అవుతారు. హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో స్టార్ట్ అయి వరంగల్ మామూనూరు ఎయిర్ స్ట్రిప్ వద్ద దిగుతారు. ముందుగా భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజలు చేస్తారు.
రాష్ట్రంలో రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల నేషనల్ హైవేల విస్తరణకు PM పునాది రాయి వేస్తారు. ఇందులో నాగపూర్-విజయవాడ కారిడార్ లో మంచిర్యాల-వరంగల్ మధ్య 108 కిలోమీటర్ల దారి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు BRS శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. PM సభలో CM కోసం ప్రత్యేకంగా స్పీచ్ టైమ్ కేటాయించినా KCR అటెండ్ కావడం లేదు. దీనికితోడు BRS లీడర్లెవరూ PM టూర్ కు రాబోరని ఆ పార్టీ స్పష్టం చేసింది.