తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో లడ్డూల ధరలు తగ్గినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. లడ్డూల ధరలతోపాటు శ్రీవారి(Srivari) ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తగ్గించినట్లు భారీస్థాయిలో మెసేజ్ లు ట్రోల్ అయ్యాయి. దీనిపై TTD ఈవో శ్యామలరావు స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, భక్తులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు తిరుమల దర్శనానికి సంబంధించి ఇంకో తరహా సందేశాలు(Messages) ప్రచారమవుతున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఎక్కువ ధరలకు పొందే అవకాశం ఉందంటూ కొన్ని ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం వైరల్ అయింది. దీనిపై EO క్లారిటీ ఇస్తూ TTD వెబ్ సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల టూరిజం డిపార్ట్మెంట్లకు కొన్ని టికెట్లు కేటాయించామన్నారు.