‘నీట్’ యూజీ-2024 పరీక్షల్లో అవకతవకలు, లీకేజీ ఆరోపణలు గందరగోళానికి కారణమైన వేళ కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్(DG) సుబోధ్ కుమార్ సింగ్ ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతలు కట్టబెడుతూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DoPT) ఆదేశాలిచ్చింది.
పేపర్ల లీకేజీ వల్ల ఇప్పటికే UGC-NETను రద్దు చేసిన కేంద్రం.. నీట్ విషయంలో విచారణకు ఆదేశించింది. పరీక్షల పారదర్శక నిర్వహణపై ఈరోజే ఏడుగురితో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలోని కమిటీ రెండు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు, ఆరోపణలు రావడంతో NTA డైరెక్టర్ జనరల్ పై వేటు వేసింది.