అఫ్గానిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయంపై అక్కడి మాజీలు తమ దేశ బోర్డు ‘క్రికెట్ ఆస్ట్రేలియా(CA)’ తీరును తప్పుపడుతున్నారు. CA తీసుకున్న నిర్ణయమే తమ జట్టు కొంప ముంచిందని.. టెస్ట్ మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అన్నాడు. అఫ్గాన్ ను ఆది(Beginning) నుంచి తక్కువ చేసి చూడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నాడు.
విషయమిది…
ఐసీసీ క్యాలెండర్ ప్రకారం అఫ్గాన్-ఆస్ట్రేలియా మధ్య మూడు సిరీస్ లు జరగాలి. కానీ 2021లో తాలిబన్లు అధికారం చేపట్టడం, క్రీడల్లో ఆ దేశ మహిళల ప్రాధాన్యం తగ్గించడంపై CA గవర్నింగ్ బాడీ తీవ్రంగా విమర్శించింది. అఫ్గాన్ తో ద్వైపాక్షిక(Bilateral) సిరీస్ ఆడకూడదన్న స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. 2023లో ఒక టెస్టు, 3 వన్డేల సిరీస్ తోపాటు ఈ ఏడాది జరగాల్సిన ఇంకో సిరీస్ వద్దనుకోవడమే తాజా ఓటమికి కారణమన్న రీతిలో CAను ఖవాజా తప్పుబట్టాడు.
బాధాకరం…
‘అఫ్గాన్ కు అభినందనలు.. మీ టీమ్ ఈరోజు చాలా బాగా ఆడింది.. ఈ గెలుపుతో మీ కుర్రాళ్లు స్వదేశంలో, అంతర్జాతీయంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మీ ఆటను ఆస్ట్రేలియా గడ్డపై చూడకపోవడం బాధాకరం..’ అంటూ ఉస్మాన్ ఖవాజా ట్వీట్ చేశాడు.