భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. 3 మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన ఆమె.. మూడో సెంచరీని తృటిలో కోల్పోయినా చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. దక్షిణాఫ్రికా(South Africa)తో బెంగళూరులో జరిగిన సిరీస్ లో ఏకఛత్రాధిపత్యం(Single Hand)తో కప్పును అందుకునేలా చేసింది.
తక్కువకే ఆలౌట్ చేసి…
టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత ఓవర్లో 215/8 స్కోరు చేసింది. మన అమ్మాయిలంతా కట్టుదిట్టం(Tight)గా బౌలింగ్ చేయడంతో రన్స్ రావడం కష్టమైపోయింది. వొల్వార్డ్త్(61), తాజ్మిన్ బ్రిట్స్(38), డి క్లర్క్(26), డి రైడర్(26) పరుగులు చేశారు.
భారత బ్యాటింగ్ లో…
స్మృతి మంధాన(90; 83 బంతుల్లో 11×4) షెఫాలి వర్మ(25), ప్రియ పూనియా(28), హర్మన్ ప్రీత్(42) రాణించారు. ఫస్ట్ వన్డేలో 117, సెకండ్ మ్యాచ్ లో 136తో మొత్తంగా ఈ సిరీస్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ 343 పరుగులు చేసింది. 40.4 ఓవర్లలోనే 220/4 చేసి విజయం సాధించిన భారత్.. 3-0తో కప్పును అందుకుంది.