రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి(BRS) పరిస్థితి అగమ్యగోచరం(Confusion)గా తయారైంది. ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులంతా ఒక్కొక్కరుగా పార్టీని విడిచిపెడుతున్నారు. కడియం, పోచారం, దానం, తెల్లం వెంకట్రావు వంటి MLAలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఇప్పుడు జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరిపోయారు.
అర్థరాత్రి…
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి అర్థరాత్రి చేరుకున్న సంజయ్ ని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయనకు పార్టీ కండువా వేశారు. ఈయన జగిత్యాల(Jagtial) నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2018లో తొలిసారి, 2023లో మరోసారి విజయం సాధించారు. కంటి వైద్య నిపుణుడిగా జిల్లాలో మంచి పేరు గల ఆయన కేసీఆర్ కుటుంబానికున్న సాన్నిహిత్యంతో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా BRSపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది.