అసలే ఆస్ట్రేలియా.. ప్రొఫెషనలిజా(Professionalism)నికి మారు పేరు.. ఏ చిన్న ఛాన్స్ దొరికినా కప్పునే ఎగరేసుకుపోతారు. అన్నట్లుగానే ఆ టీమ్.. భారీ టార్గెట్ ను సైతం అధిగమించే(Reach)లా ఆడి కలవరపాటుకు గురిచేసింది. కానీ కంటిన్యూగా బౌలర్లు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కథ ముగిసింది. ఇక దాని సెమీస్ భవితవ్యం బంగ్లాదేశ్-అఫ్గానిస్థాన్ మ్యాచ్ పై ఆధారపడి ఉంది.
భయపెట్టేలా…
రోహిత్ శర్మ(92; 41 బంతుల్లో 7×4, 8×6) హిట్టింగ్ తో మొదట భారత్ 205/5 చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కంగారూలు.. భారత బౌలర్లను తొలుత కంగారెత్తించారు. వార్నర్(6) తొందరగానే ఔటైనా హెడ్(76), మార్ష్(37), మ్యాక్స్ వెల్(20) జట్టును గెలిపించేలా ఆడారు.
కానీ అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్ తో మొదలైన వికెట్ల పరంపర కంటిన్యూ అయింది. దీంతో ఆ జట్టు 181/7తో నిలిచి 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో టీమ్ఇండియా సెమీఫైనల్లో ప్రవేసించింది. కుల్దీప్ యాదవ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. అర్షదీప్ 3, కుల్దీప్ 2, బుమ్రా, అక్షర్ తలో వికెట్ తీసుకున్నారు.