ఇరు జట్లకు సెమీస్ బెర్తుగా మారిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ మోస్తరు స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్(43), జద్రాన్(18), ఒమర్జాయ్(10), రషీద్ ఖాన్(19) పరుగులు చేశారు. ఆ టీమ్ బ్యాటింగ్ నిదానంగా సాగడంతో పెద్దగా స్కోరు చేయలేకపోయారు.
బంగ్లా బౌలర్ రిషద్ హుస్సేన్ చివర్లో విజృంభించి మూడు వికెట్లు తీయడంతో అఫ్గాన్ రన్స్ తీయలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే అఫ్గాన్ ఎలాంటి గణాంకాల(Equations)తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుతుంది. లేదంటే బంగ్లా భారీ రన్ రేట్ తో విజయం సాధించాలి. 116 టార్గెట్ ను 12.1 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. వర్షం పడి మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇక ఆసీస్ ఇంటికి అఫ్గాన్ సెమీస్ కు.