ఎలాన్ మస్క్.. టెస్లా అధినేత అయిన ఈ అపర కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడు(Richest Person). వ్యాపారంలోనే కాదు తన చేష్టలతోనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. టెస్లా, స్పేస్ X, సోషల్ నెట్వర్క్ X( మాజీ ట్విటర్) ఇలా భిన్నరకాల బిజినెస్ లు ఆయన సొంతం. ఈమధ్యన భారత్ లోని EVMలపై వివాదాస్పద(Controversy) కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.
అలాంటి మస్క్…
రెండ్రోజుల క్రితం ఆయన పన్నెండో బిడ్డకు తండ్రయ్యారు. మనిషి బ్రెయిన్ పై ప్రయోగాలు నిర్వహించే న్యూరాలింక్ ప్రాజెక్టుకు డైరెక్టర్ అయిన షివోన్ జిలిస్ తో పన్నెండో సంతానాన్ని పొందారు. పేరు, పుట్టిన బిడ్డ పాపనా, బాబా అన్నది బయటకు రాలేదు. మస్క్-జిలిస్ జంటకు ఇది మూడో సంతానమైతే.. 2021లో వీరికి కవలలు పుట్టారు. ఈ 12 మందిలో ఆరుగురు గత ఐదేళ్లలో జన్మించగా 2021లో ఆయన సరొగేట్ ద్వారా బిడ్డను కన్నారు.
మొహమాటమా…
మరింతమంది పిల్లలు కావాలని మస్క్ భావిస్తున్నారని బ్లూమ్ బర్గ్ కథనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్న జననాల రేటుపై ఆయన ఆందోళన చెందుతున్నారు. ‘పన్నెండో బిడ్డను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు.. తండ్రినని చెప్పుకోవడంలో సీక్రెట్ ఎందుకు.. సీక్రెట్ ఫాదర్ అనేది తప్పు.. ఇవన్నీ నా కుటుంబ సభ్యులు, మిత్రులకు తెలుసు.. ఈ విషయంపై మీడియాకు చెప్పడంలో ఫెయిలయ్యాం.. ఇది అనాగరిక చర్యా కాదు, రహస్యంగా ఉంచాల్సిన అవసరమూ లేదు..’ అని మస్క్ గట్టిగా చెప్పారని కథనం తెలియజేసింది.
జననాలపై…
ఇప్పుడు చాలా దేశాలు జననాల రేటు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నాయి. నిలకడైన జనాభా కోసం 2.1 బర్త్ రేట్ ఉండాల్సిన అవసరముందని, ప్రపంచం ఇప్పుడు ఈ విషయాన్ని మరచిపోయిందని స్పష్టం చేశారు. అవును కానీ… మస్క్ సంపద విలువెంతో తెలుసా.. 231 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 19 లక్షల కోట్ల రూపాయలన్నమాట. 2024కు గాను హరున్ విడుదల చేసిన రిపోర్ట్ ఈ విషయాన్ని తెలిపింది.