స్పీకర్ ఎన్నిక సందర్భంగా లోక్ సభలో అరుదైన ఘట్టం(Interesting Seen) సాక్షాత్కారించింది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ పరస్పరం ఎదురుపడటానికే ఇబ్బంది పడే ఈ ఇద్దరు అగ్రనేతలు(Top Leaders) తొలిసారిగా కరచాలనం(Shake Hand) చేసుకున్నారు. స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికవగా ఆ తర్వాత ఆయన్ను సంప్రదాయం ప్రకారం సభాపతి స్థానం వరకు తీసుకెళ్లాలి.
ఆ సమయంలో మోదీ, రాహుల్, పార్లమెంటరీ వ్యవహారాల(Affairs) మంత్రి కిరణ్ రిజిజు ముగ్గురు కలిసి ఓం బిర్లాను స్పీకర్ సీటు వద్దకు తోడ్కొని వెళ్లారు. అయితే అంతకుముందు మోదీని నవ్వుతూ పలకరించిన రాహుల్ గాంధీ.. చేతిలో చేయి వేశారు. ఈ ఇద్దరి చుట్టూ ఉన్న మంత్రులు, సభ్యులంతా చప్పట్లతో స్వాగతించారు.